తెలంగాణ
Ant Phobia: చీమల ఫోబియాతో వివాహిత మృతి

Ant Phobia: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చీమల భయంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ద్యావనపెళ్ళి మనిషా అనే యువతికి చీమలకు భయపడే మైర్మేకోఫోబియా చిన్నప్పటి నుంచి ఉంది. భర్త ఉద్యోగరీత్యా అమీన్‌పూర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. ఆఫీస్‌కు వెళ్లొచ్చిన భర్త తలుపుతట్టగా మనీషా డోర్ తీయలేదు.
అనుమానం వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా అప్పటికే మనీషా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉంది. తాను చీమల భయంతో బతకలేకపోతున్నాని పాప జాగ్రత్త, దేవుడికి మొక్కులు చెల్లించడం మర్చిపోవద్దు అని సూసైడ్ లెటర్ రాసి పెట్టి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వస్థలం మంచిర్యాలకు తరలించారు.



