తెలంగాణ
Nagarkurnool: ప్రియుడి మోజులోపడి భర్తను కడతేర్చిన భార్య

Nagarkurnool: గత నెల నవంబర్ 24న నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిన నేనావత్ లక్ష్మణ్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. లక్ష్మణ్ ది సహజ మరణం కాదని, అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని తేల్చారు. ఈ కేసులో మృతుడి భార్య నేనావత్ పద్మ, ఆమెకు సహకరించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాత్లావత్ గోపిని అచ్చంపేట పోలీసులు అరెస్టు చేశారు.
అయితే ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాత్లావత్ గోపితో పద్మకు ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడు గోపీతో కలిసి హత్య చేసింది.



