Yellamma: ఎల్లమ్మ’ సినిమాకు హీరోయిన్ ఎవరు? కొత్త ట్విస్ట్!

Yellamma: ‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా సత్తా చాటిన వేణు యెల్దండి తాజాగా కొత్త సినిమా ‘ఎల్లమ్మ’తో సిద్ధమవుతున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపికపై సస్పెన్స్ నెలకొంది.
‘బలగం’తో ఎమోషనల్ డ్రామాకు కొత్త నిర్వచనం ఇచ్చిన వేణు యెల్దండి, ‘ఎల్లమ్మ’ సినిమాతో మరో సారి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని సన్నాహాలు చేస్తున్నారు. నితిన్ ఈ చిత్రంలో హీరోగా ఫిక్స్ అయినప్పటికీ, హీరోయిన్ ఎంపికపై ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తుందనే వార్తలు వచ్చాయి, కానీ డేట్స్ సమస్యతో ఆమె తప్పుకున్నారు.
ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు వినిపించినా, తాజాగా ఆమె కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ను వదులుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు హీరోయిన్ ఎవరనేది త్వరలోనే తేలనుంది. వేణు యెల్దండి ఈ చిత్రంతో మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.