సినిమా

విజయ్‌-రష్మిక రిలేషన్ ఎప్పుడు బయటపడనుంది?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రష్మిక పాడ్‌కాస్ట్‌లో విజయ్‌లాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. గర్ల్‌ఫ్రెండ్ సక్సెస్ మీట్‌లో విజయ్ రష్మిక చేయి మీద ముద్దు పెట్టుకున్నాడు. దీంతో వీరు రిలేషన్లో ఉన్నట్టు తెలుస్తున్న ఈ జంట మాత్రం తమ బంధాన్ని బయట పెట్టడం లేదు.

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్ విషయం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఎటువంటి లీకేజీ లేకుండా దాచిపెట్టారు. ఇటీవల రష్మిక ఒక పాడ్‌కాస్ట్‌లో తాను పెళ్లి చేసుకుంటే విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తినే ఎంచుకుంటానని బహిరంగంగా చెప్పడం సంచలనం రేపింది. ఆమె నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా విజయ్ హాజరయ్యాడు. అందరూ ఈ సందర్భంగా ఎంగేజ్‌మెంట్ ప్రకటన ఉంటుందని ఎదురు చూశారు. ఇద్దరూ విజ్జూ, రషీ అని ముద్దు పేర్లతో పిలుచుకున్నారు.

విజయ్ మీడియా ముందే రష్మిక చేయి మీద ముద్దు పెట్టుకోవడం హైలైట్ అయింది. అయినా పెళ్లి ప్రకటన మాత్రం రాలేదు. బ్యాక్‌గ్రౌండ్‌లో పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. రష్మిక ఇటీవల ఉదయపూర్ వెళ్లి వేదిక చూసినట్లు టాక్. త్వరలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఘనంగా జరుపుకునే అవకాశం ఉందని టాక్. పెళ్లి తోనే వీరు తమ రిలేషన్ ని బయట పెడతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button