సినిమా
దృశ్యం 3 ఇంకెప్పుడు?

Drishyam 3: విజయవంతమైన దృశ్యం సిరీస్ మూడో భాగం వివిధ భాషల్లో తెరకెక్కుతోంది. మలయాళంలో షూటింగ్ పూర్తయి ఏప్రిల్‌లో రిలీజ్‌కు సిద్ధమైంది. హిందీ వెర్షన్ అక్టోబర్‌లో వస్తోంది. అయితే తెలుగు వెర్షన్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు.
దృశ్యం సిరీస్ మూడో భాగం వేర్వేరు భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఒరిజినల్ మలయాళం వెర్షన్ షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుందని ప్రకటించారు. అజయ్ దేవ్గన్ హీరోగా హిందీ రీమేక్ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది.
అక్టోబర్‌లో రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. వెంకటేష్ హీరోగా తెలుగు వెర్షన్ ఇంకా ఫ్లోర్‌పైకి వెళ్లలేదు. దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. దృశ్యం సిరీస్ భారీ విజయాలు సాధించిన నేపథ్యంలో మూడో భాగం కూడా అంచనాలు రేకెత్తిస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో చూడాలి.



