John Cena: జాన్ సీనా రెజ్లింగ్‌కు గుడ్‌బై!

John Cena: రెజ్లింగ్ లెజెండ్ జాన్ సీనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన చివరి మ్యాచ్ గురించి కీలక ప్రకటన చేశారు. ఈ వార్త అభిమానులను షాక్‌లో ముంచెత్తింది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న జాన్ సీనా, రెజ్లింగ్ రింగ్‌కు వీడ్కోలు పలకనున్నారు. డిసెంబర్ 13న తన చివరి మ్యాచ్‌తో రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. గత ఏడాది జూన్‌లో రిటైర్మెంట్ ప్రకటన చేసినప్పటికీ, డబ్ల్యూడబ్ల్యూఈలో కొనసాగారు. ఈ సమయంలో ఆయన పాత ఫామ్ కోల్పోయారనే విమర్శలు వచ్చాయి. అయినా, ఈ ఏడాది ‘హీల్’ పాత్రతో కోడీ రోడ్స్‌పై దాడి చేసి, రాండీ ఓర్టాన్‌తో మ్యాచ్‌లో గెలిచి మళ్లీ సెంటర్‌స్టేజ్‌లో నిలిచారు. ఇటీవల ఏజే స్టయిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో రెజ్లింగ్ దిగ్గజాల సిగ్నేచర్ మూవ్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ ఫైట్ ఈ ఏడాది ఉత్తమ ఫైట్‌గా ప్రశంసలు అందుకుంది. చివరి మ్యాచ్‌లో ఆయన ప్రత్యర్థి ఎవరనేది ఇంకా సస్పెన్స్‌లో ఉంది. డబ్ల్యూడబ్ల్యూఈ ఈ లెజెండ్‌కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తోంది. సినిమాల్లోనూ సీనా తనదైన ముద్ర వేశారు. ది మెరైన్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9, పీస్‌మేకర్ సినిమాలలో నటనతో మెప్పించారు.



