అంతర్జాతీయం

ట్రంప్ ఇండియా విషయంలో ఏం కోరుకుంటున్నాడు?

ఇండియా-అమెరికా మధ్యలో పాకిస్తాన్ మూడు దేశాల నడము ఒక ప్రశ్నకు సమాధానం మాత్రం లభించడం లేదు. పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాటలను ఏకీభవిస్తుంటే, అబ్బే అంత సీన్ లేదని ఇండియా అంటుంటే మొత్తంగా ఇండియా-అమెరికా సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నట్టుగా కన్పిస్తున్నాయి. అసలు ట్రంప్ ఇండియా విషయంలో ఏం కోరుకుంటున్నాడు. ఇండియా-పాకిస్తాన్ యుద్ధం గురించి పదేపదే ఎందుకు మాట్లాడుతున్నాడు.? అసలు యుద్ధం ఎక్కడ వచ్చింది? ట్రంప్. యుద్ధం ఎప్పుడు ఆపాడు? యుద్ధం గురించి పదేపదే ప్రస్తావించడం ద్వారా ట్రంప్ ఏం ఆశిస్తున్నాడు.

ఇండియా ఎందుకు ట్రంప్‌కు క్రెడిట్ ఇవ్వడం లేదు పాకిస్తాన్ క్రెడిట్ ఇవ్వడంతోపాటు, నోబుల్ అవార్డు కూడా ఇవ్వాలన్నంతగా ఎందుకు భజన చేస్తోంది? ట్రంప్ కోరుకున్నట్టుగా ఇండియా వ్యవహరించకపోవడానికి కారణమేంటి? ఇండియా నుంచి ట్రంప్ ఏం కోరుకుంటున్నారు? అమెరికా కోసమా తన కంపెనీల కోసమా? తాజాగా మరోసారి ఇండియా-పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానంటున్న ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అణ్వాయుధ సామర్థ్యమున్న రెండు దేశాల మధ్య పూర్తి, తక్షణ కాల్పుల విరమణ తన దౌత్య చతురత ఫలితమన్నాడు.

ఇదే మాటను గతంలో కూడా అనేక సార్లు జపించాడు ట్రంప్. అమెరికా మధ్యవర్తిత్వం వహించడం వల్లే చర్చల తర్వాత కాల్పుల విరమణ సాధ్యమైందన్నాడు. తాజాగా ఆసియా పర్యటనకు ముందు ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య ఉన్న ఉద్రిక్తతను పరిష్కరించడం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కంటే కఠినమైందని పేర్కొన్నాడు. కానీ దానిని మనోనిబ్బరంతో ఆపగలిగానన్నాడు. ఇండియా-పాకిస్తాన్ మధ్య తాను కుదిర్చిన ఒప్పందం, చాలా ఒప్పందాల కంటే కఠినమైందన్నాడు.

కానీ తాను తేలిగ్గా పరిష్కరించగలగానన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన ఘర్షణలను పరిష్కరించానన్న ట్రంప్ నిజమైన శాంతి స్థాపకుడు తనేనన్నాడు. సుంకాల బెదిరింపులు లేకపోతే ఈ వివాదాలు ఎప్పుడూ ముగిసేవి కావంటూ ఓవరాక్షన్ చేస్తూనే ఉన్నాడు.

అయితే, భారత్ మాత్రం ట్రంప్ వాదనను మొదట్నుంచి తిరస్కరిస్తూ వస్తోంది. కాల్పుల విరమణ నిర్ణయం ఎటువంటి మూడో పక్షం మధ్యవర్తిత్వం లేకుండా, ద్వైపాక్షిక చర్చల ద్వారానే జరిగిందని ఇండియా స్పష్టం చేసింది. ఇండియా నిర్ణయాలన్నీ కూడా దేశ ప్రయోజనాల ప్రకారం మాత్రమే ఉంటాయని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇండియా, రష్యా చమురు దిగుమతిని నిలిపేస్తుందని ట్రంప్ పదేపదే వ్యాఖ్యానిస్తాడు.

ముందుగా రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకుంటుందంటాడు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ రష్యా నుండి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తామని హామీ ఇచ్చారంటూ ట్రంప్ పేర్కొన్నాడు. వెంటనే జరక్కున్నా గానీ, త్వరలో కొనుగోళ్లు ఆగుతాయన్నాడు. అయితే భారత ప్రభుత్వం మాత్రం ట్రంప్ వాదనుకు భిన్నమైన క్లారిటీ ఇచ్చింది.

దేశ ఇంధన అవసరాలు, వినియోగదారుల ప్రయోజనాల ఆధారంగా మాత్రమే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆసియన్ సమ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలుసుకోవాలనే తన ప్రణాళికలను కూడా ట్రంప్ నిలిపివేశాడు. చైనా అధ్యక్షుడ్ని కలవడం కోసం పుతిన్‌ సమావేశాన్ని కూడా ట్రంప్ వాయిదా వేసుకున్నాడు. జీజిన్‌పింగ్‌తో మాట్లాడితే యుద్ధం కూడా ఆగిపోతుందన్నాడు.

ఇక రష్యా చమురు కొనొద్దని చైనాను కూడా కోరతానన్నాడు. ఓవైపు రష్యాను బెదిరిస్తున్నానంటాడు. మరోవైపు చైనాతో డీల్స్ అంటాడు. ఇండియా యుద్ధాన్ని ఆపానంటాడు. ఇవన్నీ చేసినందుకు గాను తనకు ప్రపంచ శాంతి దూత అవార్డు ఇవ్వాలంటాడు. కానీ ఇండియా యుద్ధాన్ని ఆపానని ట్రంప్ చెప్తుంటే మాత్రం అంగీకరించకపోవడంతో లాక్కోలేక పీక్కోలేక సతమతమవుతున్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button