తెలంగాణ

రేపు తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

రేపు తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరగగా, సాయంత్రం ఫలితాలు వెలవడనున్నాయి. మొత్తం 4వేల236 గ్రామపంచాయతీలకు గాను 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 395 చోట్ల సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 3వేల 836 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

అలాగే 27వేల 960 వార్డు స్థానాలకు ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క సర్పంచ్ స్థానానికి సగటున ఆరుగురు బరిలో నిలిచారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందజేయనున్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర ఎన్నికల సామాగ్రితో సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం వరకు తరలివెళ్లనున్నారు. రేపు ఉదయం సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button