తెలంగాణ
Dandepally: కోతులు, కుక్కల సమస్య పరిష్కరించే వారికే ఓటు

Dandepally: గ్రామాల్లో స్థానిక సంస్తల ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్‌లు వేస్తున్నారు. అయితే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో మాత్రం కుక్కల బెడద, కోతుల బెడద ఎక్కువగా ఉందని వాటి బెడదను తీర్చిన వారికే తమ ఓట్లు వేస్తామని గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు.
ఈ క్రమంలోనే దండేపల్లిలోని గాంధీ చౌక్ వద్ద ఫ్లకార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు. గ్రామంలో కుక్కలు, కోతుల దాడిలో అనేక మంది గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వీటి నుంచి విముక్తి కల్పించిన వారికే ఓట్లు వేసి గెలిపిస్తామన్నారు.



