తెలంగాణ
రైతులకు కునుకు లేకుండా చేస్తున్న అకాల వర్షాలు

సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలు రైతులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. వరి, మామిడి రైతులకు వర్షాలు కన్నీరు మిగుల్చుతున్నాయి. కోతలు పూర్తయిన ధాన్యం కొనుగోలు సెంటర్లలో తడిసి ముద్దవుతున్నాయి. వడగళ్ల వానతో నారుపై గింజ లేకుండా రాలిపోయిందని రైతులు వాపోతున్నారు.
ఎకరాకు 40 వేల వరకు ఖర్చు చేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమకు ఆత్మహత్యే దిక్కు అని అంటున్నారు.