Kannappa: విష్ణు మంచు ‘కన్నప్ప’ గ్లోబల్ ప్రమోషన్స్ జోరు

Kannappa: విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ను అంతర్జాతీయ స్థాయిలో ఓ సంచలనంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. ఈ హిస్టారికల్ చిత్రం ప్రమోషన్స్ అమెరికా నుంచి ఘనంగా ఆరంభం కానున్నాయి.
విష్ణు మంచు నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం ప్రపంచవ్యాప్త మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ ప్రచారానికి రెడీ అవుతోంది. మే 8న న్యూజెర్సీలోని రీగల్ కామర్స్ సెంటర్లో అభిమానులతో ముచ్చటించడంతో USA టూర్ షురూ కానుంది. మే 9న డల్లాస్‌లోని గెలాక్సీ థియేటర్స్ గ్రాండ్స్కేప్లో సాయంత్రం 7 గంటలకు ప్రేక్షకులతో సందడి చేస్తారు.
మే 10న శాన్ ఫ్రాన్సిస్కోలోని సినీ లాంజ్ ఫ్రీమాంట్‌లో ఉదయం 10:30కి ఈ టూర్ ముగుస్తుంది. ఓవర్సీస్ రిలీజ్‌ను వాసారా సంస్థ చూస్తోంది. ఇండియాకు తిరిగి వచ్చిన విష్ణు దేశవ్యాప్త పర్యటనతో ప్రమోషన్స్ కొనసాగించనున్నారు. “శివా శివా శంకరా” గీతం, లవ్ ట్రాక్ ఇప్పటికే సంచలనం సృష్టించాయి. ట్రైలర్ కోసం అంచనాలు ఆకాశమంటుతున్నాయి. జూన్ 27న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌తో ‘కన్నప్ప’ బాక్సాఫీస్‌ను ఓ రేంజ్లో షేక్ చేయనుంది.