ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత వివాదం

విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతలకు దారి తీసింది. భవానీపురంలో 42 నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం దగ్గరకు చేరుకున్నారు. ఇళ్లు లేక రోడ్డున పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ న్యాయం చేయాలని వేడుకున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని.. తమకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదని బాధితులు వాపోయారు.



