ఆంధ్ర ప్రదేశ్
AP Liquor Scam Case: నేడు సిట్ ముందుకు విజయసాయి రెడ్డి

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు మళ్లీ స్పీడప్ అయింది. లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఇవాళ సిట్ అధికారుల ఎదుట విజయసాయి రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం 10గంటలకే విచారణకు రావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది.
ఇప్పటికే విజయసాయిని రెండుసార్లు సిట్ అధికారులు ప్రశ్నించారు. కాగా లిక్కర్ కేసులో ఏ-5గా ఉన్నారు విజయసాయి రెడ్డి. నిధుల మళ్లింపులో కీలక పాత్ర ఉన్నట్లు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే తాను కేవలం విజిల్‌బ్లోయర్‌నని మాత్రమేన ని విజయసాయి రెడ్డి చెబుతున్నారు.