జేసన్ సంజయ్ ‘సిగ్మా’ టైటిల్ పోస్టర్ రిలీజ్!

Sigma: విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ డైరెక్టర్‌గా కోలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. అతని మొదటి చిత్రం ‘సిగ్మా’కు టైటిల్ పోస్టర్ రిలీజ్ అయింది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం.
తమిళ సూపర్‌స్టార్ విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ డైరెక్టర్‌గా వెండితెరకు పరిచయం కావడానికి సిద్ధమవుతున్నాడు. టోర్నాడోలోని ప్రసిద్ధ ఫిల్మ్ స్కూల్‌లో డైరెక్టర్‌గా శిక్షణ పొందిన జేసన్, గతంలో కొని షార్ట్ ఫిల్మ్‌లు తెరకెక్కించాడు. ఈ అనుభవంతోనే కోలీవుడ్‌లో డెబ్యూ చేస్తున్నాడు. అతని మొదటి చిత్రంలో తెలుగు యాక్టర్ సందీప్ కిషన్‌ను హీరోగా ఎంపిక చేశారు. ఇటీవల సందీప్ బర్త్‌డే సందర్భంగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఈ చిత్రానికి ‘సిగ్మా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ టైటిల్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో సందీప్ కిషన్ గిల్డ్ బిస్కెట్లు, డబ్బు కట్టల మధ్య కూర్చుని ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. తండ్రి విజయ్ స్టార్ హీరో అయినప్పటికీ, జేసన్ పూర్తిగా డైరెక్షన్‌పై దృష్టి పెడుతున్నాడు. హీరో అవ్వడం కంటే ప్రేక్షకులు మెచ్చుకునే కంటెంట్ ఇవ్వడమే ముఖ్యమని భావిస్తున్నాడు. భవిష్యత్తులో హీరోగా మారతాడేమో చూడాలి. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మేకర్స్ షూటింగ్ త్వరగా పూర్తి చేసి, వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.



