శింబు సినిమాలో విజయ్!

కోలీవుడ్ స్టార్ శింబు నటిస్తున్న ‘అరసన్’ చిత్రంలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వెట్రిమారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు ఈ అప్‌డేట్ హైప్‌ను రెట్టింపు చేసింది.
శింబు కెరీర్‌లో 49వ చిత్రం ‘అరసన్’. తెలుగులో ‘సామ్రాజ్యం’గా రాబోతుంది. శింబు వింటేజ్ లుక్‌లో, చేతిలో కత్తి, రక్తంతో తడిసిన చేతులు, పక్కన సైకిల్ కనిపించడం పక్కా వెట్రిమారన్ మార్క్ రా యాక్షన్ డ్రామాను సూచిస్తోంది. ఈ చిత్రం ‘వడచెన్నై యూనివర్స్’లో భాగమే అని టాక్. హీరోయిన్‌గా సమంత పేరు వినిపిస్తోంది. సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా సాగుతోంది.
ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు భారీ బూస్ట్ ఇచ్చే వార్త వచ్చింది. విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన గెటప్‌ను టీమ్ అధికారికంగా విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం నిండిపోయింది. వెట్రిమారన్-శింబు-విజయ్ సేతుపతి కాంబినేషన్ స్క్రీన్ పై ఎలా ఉంటుందన్న ఆసక్తి కోలీవుడ్‌ను ఆవరించింది.



