జైలర్-2లో విజయ్ సేతుపతి?

Jailer 2: తలైవా రజనీకాంత్ నటిస్తున్న జైలర్-2 సినిమా రోజురోజుకూ హైప్ పెంచేస్తుంది. తాజాగా ఇందులో విజయ్ సేతుపతి కూడా చేరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గోవా షెడ్యూల్లో ఆయన నటించనున్నారని తెలుస్తుంది.
కూలీ సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న జైలర్-2 సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీలో రజనీకాంత్‌తో పాటు శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, జాకీ శ్రాఫ్ వంటి ప్రముఖులు నటిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా మరో స్టార్ విజయ్ సేతుపతి కూడా ఈ ప్రాజెక్టులో జాయిన్ అయినట్టు టాక్. గోవా షెడ్యూల్లో ఆయన పాల్గొంటున్నట్టు సమాచారం. అయితే విజయ్ పాత్ర గురించి ఇంకా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదల కానుంది.



