సినిమా
Sir Madam Trailer: ఆకట్టుకుంటున్న సర్ మేడమ్ ట్రైలర్!

Sir Madam Trailer: విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన ‘సర్ మేడమ్’ ట్రైలర్ విడుదలైంది. ఈ రొమాంటిక్ కామెడీ భార్యాభర్తల గొడవలను, ప్రేమను హాస్యాత్మకంగా చూపిస్తూ ఆకర్షిస్తోంది.
విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా ‘సర్ మేడమ్’ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. భార్యాభర్తల మధ్య సరదా గొడవలు, హాస్యం, భావోద్వేగాలతో ట్రైలర్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది. విజయ్ సేతుపతి డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ట్రైలర్‌కు జీవం పోసాయి.
నిత్యా మీనన్ తన నటనతో మరోసారి మెప్పిస్తోంది. సామాజిక సందేశంతో కూడిన ఈ రొమాంటిక్ కామెడీని పాండిరాజ్ రూపొందించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై సెంథిల్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. యోగిబాబు కీలక పాత్రలో నవ్విస్తాడు. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో జూలై 25న ఈ చిత్రం విడుదలవుతోంది.