
Vijay – Rashmika: హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. సోమవారం రాత్రి వీరిద్దరూ ముంబాయి ఎయిర్పోర్టులో కనిపించారు. ముందుగా ఎయిర్ పోర్టుకు వచ్చిన రష్మిక ఫొటో గ్రాఫర్లకు ఫోజులిచ్చారు. అభిమానులతో కలిసి ఫొటోలు దిగి సందడి చేశారు. ఇది జరిగిన కొద్ది సేపటికే విజయ్ దేవరకొండ కూడా అక్కడ సందడి చేశారు. వీరిద్దరూ క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.