Vijay Deverakonda:‘కింగ్‌డమ్’పై సాలిడ్ అప్డేట్

Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ చిత్రం ‘కింగ్‌డమ్’ నుంచి క్రేజీ అప్‌డేట్! ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా విజయ్ స్వయంగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న ‘కింగ్‌డమ్’ సినిమా డబ్బింగ్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తయిందని విజయ్ దేవరకొండ ఇన్‌స్టా స్టోరీలో వెల్లడించారు. దర్శకుడు గౌతమ్‌తో చర్చిస్తున్న ఫోటోను షేర్ చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది.
విజయ్ కెరీర్‌లోనే డిఫరెంట్ లెవెల్‌లో ఉంటుందని టీజర్ స్పష్టం చేసింది. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బొర్సె నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు బిగ్ హైలైట్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.