Kingdom: కింగ్ డమ్ కలెక్షన్స్ షాక్!

Kingdom: విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమా మిశ్రమ స్పందనతో రన్ అవుతోంది. తొలి రోజు మంచి వసూళ్లు వచ్చినా, రెండో రోజు కలెక్షన్స్ డ్రాప్ ఆశ్చర్యం కలిగించింది. సినిమా ఫుల్ రన్ ఎలా ఉంటుంది? అనే దానిపై చర్చ నడుస్తుంది.
విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద 39 కోట్ల గ్రాస్ తో బలమైన ఆరంభం సాధించినప్పటికీ, రెండో రోజు నుంచి వసూళ్లలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. భారీ ఓపెనింగ్స్ ఉన్నా రెండో రోజుతో కనీసం 60 కోట్లు కూడా దాటకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.గౌతం తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ సూరి పాత్రలో అద్భుతంగా నటించినా, కథనం, సెకండ్ హాఫ్ లో లోపాలు సినిమాపై ప్రభావం చూపాయి.
అనిరుధ్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భాగ్యశ్రీ బోర్స్ తో విజయ్ కెమిస్ట్రీ ఆకట్టుకోలేదని ప్రేక్షకుల అభిప్రాయం. ఓ సాంగ్ ను తొలగించడం కూడా కొంత నిరాశ కలిగించింది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ బాగున్నా, తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. వీకెండ్ తర్వాత సినిమా పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరం.