కొత్త లుక్‌తో విజయ్ దేవరకొండ సంచలనం!

Vijay Devarakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన కొత్త చిత్రం ‘కింగ్డమ్’తో సందడి చేస్తున్నాడు. తాజాగా ఓ ఈవెంట్లో సరికొత్త లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. మీసం, మ్యాచో స్టైల్‌తో విజయ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విజయ్ దేవరకొండ ఈ పేరు చెబితే యూత్‌లో క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ రౌడీ హీరో తన కొత్త సినిమా ‘కింగ్డమ్’ కోసం సిద్ధమవుతూ అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. కానీ, ఇప్పుడు విజయ్ సరికొత్త లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఓ ఈవెంట్లో గడ్డం తీసేసి, మీసంతో మ్యాచో స్టైల్లో కనిపించాడు ఈ స్టార్ హీరో. ఈ లుక్ అభిమానులను ఫిదా చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఫ్యాన్స్ విజయ్ ఫోటోలను షేర్ చేస్తూ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ లుక్ ‘కింగ్డమ్’ కోసమేనా లేక మరో సర్ప్రైజ్ ఉందా? అని అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.