తెలంగాణ
Jagadish Reddy: కాంగ్రెస్ నేతలే తెలంగాణ ద్రోహులు

Jagadish Reddy: రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలే తెలంగాణ ద్రోహులు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా ప్రభుత్వంలో 6 లక్షల 50 వేల రేషన్ కార్డులిచ్చామన్నారు. దీనిపై ప్రభుత్వంతో ఎలాంటి చర్చకైనా సిద్ధమని జగదీశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్‌కు మోదీ చీకటి గురువు అన్నారు.
నీళ్ల విషయంలో సీఎం రేవంత్ మరోసారి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. మా హయాంలో నల్గొండను వ్యవసాయంలో నంబర్ వన్‌గా మార్చామన్నారు. ధాన్యం ఉత్పత్తిని 3 లక్షల నుంచి 40 లక్షల టన్నులకు పెంచామని జగదీశ్వర్ రెడ్డి అన్నారు.