ఆంధ్ర ప్రదేశ్
Vidadala Rajini: జంట హత్యల కేసులో టీడీపీ నేతల హస్తం ఉంది

Vidadala Rajini: కూటమి ప్రభుత్వం వైసీపీని అణచివేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి విడదల రజిని. పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్య కేసులో పిన్నెల్లి బ్రదర్స్‌ను అక్రమంగా ఇరికించారన్నారు. ఈ కేసులో టీడీపీ నేతల హస్తం ఉందని ఆనాడే ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారిని విడదల రజిని గుర్తుచేశారు.
సుప్రీం కోర్టు ఆదేశాలతో కోర్టులో పిన్నెల్లి సోదరలు లొంగిపోతే జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించడం దారుణమన్నారు. తమ నాయకుడికి మద్దతు తెలిపేందుకు వెళ్తుంటే ఎక్కడికక్కడే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.



