ఆంధ్ర ప్రదేశ్

Vidadala Rajini: వ్యాధులు విజృంభిస్తుంటే ప్రభుత్వం నిద్రమత్తులో ఉంది

Vidadala Rajini: గుంటూరులో డయేరియా, కలరా విజృంభిస్తుంటే ప్రభుత్వం మాత్రం నిద్ర మత్తులో ఉందని మాజీమంత్రి విడదల రజిని మండిపడ్డారు. గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని డయేరియా బాధితులను ఆమె పరామర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాష్ట్రంలోని అన్ని సమస్యలను గాలికి వదిలేసారని ఆరోపించారు. గత కొంతకాలంగా గుంటూరు జిల్లాలో ఎంతోమంది డయేరియా, కలరా బారిన పడ్డారని, ప్రస్తుతం గుంటూరు జిహెచ్ లో 11 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు.

అధికారులు గానీ కూటమి నాయకులు కానీ కనీసం వారిని పరామర్శించిన పాపాన పోలేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే స్పందించి వాటిని నిర్మూలించామని కూడా ఆమె గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ఉన్న ధ్యాస రాష్ట్రంలోని సమస్యలపై కూటమి నాయకులకు లేదని ఫైర్ అయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button