ఆంధ్ర ప్రదేశ్
Vidadala Rajini: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది

Vidadala Rajini: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పడానికి పులివెందులలో జరిగిన ఘటనలే సాక్ష్యమని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. జడ్పీటీసీ ఉపఎన్నికల్లో గెలవలేమని తెలిసే టీడీపీ రౌడీలు అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీ నాయకుడు, ఎమ్మెల్యే రమేష్ యాదవ్‌పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి విడదల రజినీ డిమాండ్ చేస్తున్నారు.



