#వెంకీ 77 రెగ్యులర్ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్?

సంక్రాంతి వస్తున్నాం లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత విక్టరీ వెంకటేశ్ నెక్స్ట్ ప్రాజెక్టు త్రివిక్రమ్ దర్శకత్వంలో లాక్ అయింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ కాంబో ఇప్పుడు రియల్ అవుతోంది. డిసెంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
విక్టరీ వెంకటేశ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో అనేది ఎప్పటి నుంచో ఫ్యాన్స్ కోరికగా మిగిలింది. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలకు త్రివిక్రమ్ డైలాగ్ రైటర్‌గా పనిచేశాడు. అనేక వాయిదాల తర్వాత ఇప్పుడు ఈ కల నెరవేరింది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం త్రివిక్రమ్ స్టైల్ కామెడీ, పంచ్ డైలాగ్స్, ఎమోషనల్ డ్రామాతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందనుంది.
హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. డిసెంబర్ 15 నుంచి లాంగ్ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకి ‘వెంకటరమణ C/O ఆనంద నిలయం’, ‘అలివేలు వెంకటరత్నం’ వంటి టైటిల్స్ పరిశీలిస్తున్నారు.



