బాలయ్య-వెంకీ మల్టీస్టారర్!

Tollywood: టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలకు ఉండే ఆదరణ అందరికీ తెలిసిందే. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ కలిసి ఓ క్రేజీ మల్టీస్టారర్‌లో నటించనున్నారని సమాచారం.
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. స్టార్ హీరోలు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ త్వరలో ఓ భారీ మల్టీస్టారర్‌లో కలిసి నటించనున్నట్లు తాజా సమాచారం. వెంకటేష్ అమెరికాలో జరిగిన తానా సభల్లో తన రాబోయే ప్రాజెక్టులను ప్రకటించారు.
త్రివిక్రమ్‌తో ఓ చిత్రం, చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో కేమియో, మీనాతో ‘దృశ్యం-3’, అనిల్ రావిపూడితో మరో సినిమా, ఆ తర్వాత బాలయ్యతో మల్టీస్టారర్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో బాలయ్య, వెంకీ అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమా టాలీవుడ్‌లో కొత్త హైప్‌ను క్రియేట్ చేసే అవకాశం ఉంది.