తెలంగాణ
నేడు వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేత

నేడు వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. అభివృద్ధి పనుల కోసం అధికారులు దర్శనాలు నిలిపివేశారు. భక్తులు వెళ్లకుండా ఆలయ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. భీమన్న ఆలయంలో దర్శనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమాచారం లేకుండా దర్శనం నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.



