ఆంధ్ర ప్రదేశ్
Anitha: స్కూటీపై మైనర్లు.. క్లాస్ పీకిన ఏపీ హోంమంత్రి

Anitha: విజయనగరం జిల్లాలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. కాన్వాయ్ ముందు ద్విచక్ర వాహనంతో స్టంట్లు కొట్టిన మైనర్ బాలుడిని హోంమంత్రి అనిత మందలించారు. పిల్లలు వివరాలు అడిగి తెలుసుకొని తల్లిదండ్రులకు సమాచారం అందించాలని మంత్రి అనిత పోలీసులను ఆదేశించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలుకు వాహనాలు ఇచ్చే విషయంలో, రహదారి భద్రత నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని హోంమంత్రి అనిత సూచించారు.



