తెలంగాణ
KTR: అసమర్థుల పాలనలో యూరియా కష్టాలు వచ్చాయన్న కేటీఆర్

KTR: పరిపాలన తెలియని అసమర్థులు రాజ్యమేలుతున్నందునే అన్నదాతలకు యూరియా కష్టాలు వస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు అవసరమైన యూరియా కోసం సీజన్ ముందు నుంచే ప్రణాళికబద్దంగా పంపిణీ, సరఫరా ఏర్పాట్లను పర్యవేక్షించేవారని కేటీఆర్ తన ట్వీట్‌లో గుర్తు చేశారు.
ఇది కదా నాయకత్వం అంటే ఇది కదా ముందు చూపు అంటే అంటూ కేసీఆర్ తీసుకున్న నాటి నిర్ణయాలను ఉటంకిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏపీలోని నౌకాశ్రయాల దగ్గరికి , రైల్వే అధికారుల దగ్గరికి, పక్క రాష్ట్రాల మంత్రుల దగ్గరికి తెలంగాణ అధికారులను పంపించి యూరియా సరఫరా ఏర్పాట్లను కేసీఆర్ పురమాయించేవారని కేటీఆర్ గుర్తుచేశారు.



