తెలంగాణ
Uttam Kumar Reddy: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఇండస్ట్రీయల్ పాలసీ అర్థం కాలేదు

Uttam Kumar Reddy: ఇండస్ట్రీయల్ పాలసీపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యనగరాన్ని పొల్యూషన్ ఫ్రీగా చేయడమే తమ ప్రభుత్వ పాలసీ లక్ష్యమన్నారు. ఈ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదన్నారు. తమ ప్రభుత్వం తెచ్చింది పారదర్శకమైన పాలసీ అని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తాము తెచ్చిన ఇండస్ట్రీయల్ పాలసీ అర్థం కాలేదని తెలిపారు.
ప్రతిపక్షాల నేతలు కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ORR బయటకు పంపాలనే డిమాండ్ ఉందని గుర్తుచేశారు. ఈ పాలసీ తమ ప్రభుత్వం కొత్తగా తెచ్చినది కాదని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఈ పాలసీపై చర్చ జరిగిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది లేదని పాలసీ మార్చేది లేదన్నారు.



