అంతర్జాతీయం
Donald Trump: భారత్‌కు ఎఫ్-35 యుద్ధ విమానాలు విక్రయిస్తాం

Donald Trump: భారత్‌కు ఎఫ్ 35 యుద్ధ విమానాలు విక్రయిస్తామన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్‌కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను మరింత పెంచుతామని వెల్లడించారు. అందులో ఎఫ్ 35 స్టెల్త్ ఫైటర్లు జెట్లు భాగమని తెలిపారు. ఇక భారత్ కోసం మంచి వాణిజ్య విధానం రూపొందిస్తామన్న ట్రంప్.. అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్‌ను, భారత్ మరింతగా కొనుగోలు చేస్తుందని చెప్పారు.
తొలుత భేటీకి ముందు కలుసుకున్న ఇరువురు దేశాధినేతలు.. మిమల్ని చాలా మిస్యయ్యా అంటూ మోదీతో ట్రంప్ చెప్పగా, తనకు కూడా మిమల్ని చూడటం ఆనందంగా ఉందని ట్రంప్‌నకు మోదీ బదులిచ్చారు.