Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయాలు..

Donald Trump: తనదైన స్టైల్‌లో పాలన షురూ చేశారు డొనాల్డ్ ట్రంప్. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు ట్రంప్. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వాక్ స్వాతంత్ర్యంపై సెన్సార్ తొలగించారు. జీవన వ్యయాల సంక్షోభంపై దృష్టిపెట్టాలని ఏజెన్సీలకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసులకు వచ్చి విధుల్లో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. కెనడా, మెక్సికోలపై ఫిబ్రవరి 1 నుంచి 25శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ అల్టిమేటమ్ జారీ చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. రాడికల్ పరిపాలన ఉత్తర్వులు రద్దు చేశారు. యంత్రాంగంపై పట్టు సాధించేవరకు.. అధికారులు ఆదేశాలు జారీ చేయకుండా ఆర్డర్స్ ఇచ్చారు. సమాఖ్య నియామకాలను నిలిపివేశారు. క్యాపిటల్ దాడి కేసులు రద్దు చేస్తూ.. తన మద్దతుదారులకు క్షమాభిక్ష పెట్టారు.
ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు జన్మిస్తే.. ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని.. రద్దు చేశారు. అమెరికా రాజ్యాంగంలో 14 సవరణ ప్రకారం పిల్లకు ఈ హక్కు సంక్రమించాల్సి ఉంటుంది. తాజాగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.