అమెరికా-చైనా టారిఫ్ యుద్ధం ప్రభావం.. భారీ నష్టాల్లో ఆసియా మార్కెట్లు

మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంతో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన ట్రంప్ ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో సృష్టిస్తున్న భగభగలు చల్లారటం లేదు. అమెరికాతో వ్యాపారం చేస్తున్న ప్రతి దేశాన్నీ కాళ్ల బేరానికి వచ్చేలా చేయడానికి ఆయన ఎంచుకున్న ప్రతీకార సుంకాలు అమెరికా సహా అన్ని స్టాక్ మార్కెట్లలోనూ కల్లోలాన్ని కొనసాగిస్తున్నాయి. ఇవాళ జపాన్ నిక్కి 4శాతం పడిపోయింది. ఇక దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మార్కెట్లలోనూ నష్టాల పరంపర కొనసాగుతోంది.
మంగళవారం అమెరికా మార్కెట్లు కోలుకున్నా ఈ ట్రేడ్ వార్ భయాలతో ఇవాళ మళ్లీ పతనం దిశగా కదిలాయి. మరోవైపు ట్రంప్ చర్యలతో ప్రపంచాన్ని మాంద్యం ముంచెత్తే అవకాశా లు 60శాతానికి చేరినట్లు ఆర్థిక దిగ్గజాలు ప్రకటించాయి. ట్రంప్ టారిఫ్ వార్‌తో ప్రపంచ మార్కెట్లను బేర్ చీల్చిచెండాడుతోంది. ఆసియా నుంచి అమెరికా దాకా ఇన్వెస్టర్లు కుదేలవుతు న్నారు.
చెప్పాలంటే అమెరికా సుంకాలకు చైనా ప్రతీకార టారిఫ్‌లు విధించడం ఇతర దేశాలూ అదే బాటలో వెళ్తుండటంతో వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. దీంతో ద్రవ్యోల్బణం ఎగబాకి ఆర్థిక మాంద్యానికి దారి తీయొచ్చనే భయాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది.