Rashmika Mandanna: రష్మికకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్?

Rashmika Mandanna: రష్మిక మందన్న ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచింది. పాన్ ఇండియా సినిమాలతో స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్న ఈ అమ్మడు, ఇతర హీరోయిన్లకు ధీటుగా ఆధిపత్యం చలాయిస్తోంది. ‘పుష్ప-2’ గ్రాండ్ సక్సెస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రష్మిక, ‘ఛావా’ సినిమాతోనూ తన సత్తా చాటి టాప్ హీరోయిన్ గా మారింది. అయితే, ఈ బ్యూటీకి ఇప్పుడు బ్యాడ్ టైమ్ తప్పడం లేదన్న టాక్ బయటికొస్తోంది.
హీరో నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ రీసెంట్‌గా రిలీజై యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమాలో మొదట రష్మికనే హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఛాన్స్ శ్రీలీలకు దక్కింది. అయితే, సినిమా విడుదల తర్వాత శ్రీలీల పాత్రపై సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. దీంతో, ‘రష్మిక ఈ సినిమా చేయకపోవడం లక్కీ’ అంటూ ఆమె ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
కానీ, బాలీవుడ్‌లో మాత్రం రష్మికకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన ‘సికందర్’ భారీ అంచనాల మధ్య రిలీజైనప్పటికీ, ప్రేక్షకుల నుంచి నెగెటివ్ రెస్పాన్స్‌తో నీరసం తెప్పించింది. ఈ ఫ్లాప్‌తో ‘రష్మిక బాలీవుడ్‌లో బుక్ అయ్యింది’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సౌత్‌లో ఫ్లాప్‌ను తప్పించుకున్న ఈ బ్యూటీకి, నార్త్‌లో మాత్రం ప్లాప్ తప్పలేదు. రష్మిక కెరీర్‌లో ఇదొక ఊహించని షాక్ అని చెప్పక తప్పదు. ఇకపై ఈ నేషనల్ క్రష్ ఎలాంటి సినిమాలతో బౌన్స్ బ్యాక్ అవుతుందో చూడాలి.