తెలంగాణ
గాంధీభవన్ ముందు నిరుద్యోగుల ఆందోళన
గాంధీభవన్ ముందు నిరుద్యోగులు నిరసన తెలిపారు. పవర్ సెక్టార్ లో ఖాళీగా ఉన్న 4వేల పోస్టులు వెంటనే విడుదల చేయాలని.. గాంధీభవన్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచాక 100 రోజుల్లో నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న ప్రభుత్వం.. ఏడాది గడుస్తున్నా నోటిఫికేషన్ పై క్లారిటీ ఇవ్వలేదని మండిపడ్డారు.
జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 2024 లో విడుదల కావలసిన విద్యుత్ సంస్థలో.. టీజీ ట్రాన్స్కో,టీజీ ఎంపీడీసీఎల్, టీజీ ఎస్పీడిసిల్, అసిస్టెంట్ ఈంజినీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్ మెన్ లకు సంబంధించి దాదాపు 4వేల పోస్టులు ఉన్నాయని.. పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క వివిధ సందర్భాల్లో.. నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చినా.. ఇప్పటివరకు ఎలాంటి కొత్త నోటిఫికెషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.