తెలంగాణ
వాలీబాల్ కోచ్ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్ధిని సూసైడ్

హైదరాబాద్ తార్నాకలో దారుణం చోటు చేసుకుంది. వాలీబాల్ కోచ్ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్ధిని సూసైడ్ చేసుకుంది. తార్నాక రైల్వే కళాశాలలో మౌనిక డిగ్రీ చదువుతుంది. అదే కాలేజీలో వాలీబాల్ కోచ్‌గా పనిచేస్తున్న అంబాజీ ప్రేమించాలని మౌనికను వేధించాడు. అంబాజీ వేధింపులకు తీవ్ర మనస్తాపానికి గురై మౌనిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.



