తెలంగాణ

Siddipet: అప్పుల బాధ భరించలేక దంపతుల ఆత్మహత్య

Siddipet: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర సంఘటన బెజ్జంకి మండలం దాచారంలో చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు బెజ్జంకిలో వస్త్ర దుకాణం దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శ్రీహర్ష తన మధ్యవర్తిగా ఉండి అనిల్ వ్యక్తికి లక్షల్లో అప్పు ఇప్పించాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా అనిల్‌ స్పందించలేదు.

దీంతో అప్పు ఇచ్చిన అభిషేక్‌, రాజశేఖర్‌, భూపతి, శ్రీనివాస్‌ అనే వ్యక్తులు శ్రీహర్షను బెదిరించారు. దీంతో మనస్థాపంతో చెందిన శ్రీహర్ష దంపతులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు దవాఖానకు తరలించాగా అప్పటికే రుక్మిణి మరణించగా శ్రీహర్ష చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button