తెలంగాణ
Ponguleti: మా ముగ్గురికి సీఎం పదవిపై ఆలోచన లేదు

Ponguleti: కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి మంత్రుల ఫోన్‌లను ట్యాపింగ్ చేస్తున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తప్పుడు ఆరోపణలని పొంగులేటి విమర్శించారు. తమ ముగ్గురికి సీఎం పదవిపై ఆలోచన లేదని పొంగులేటి స్పష్టం చేశారు. మీ ప్రభుత్వంలో ట్యాపింగ్ చేసినట్లు మిగతా వారు కూడా ట్యాపింగ్ చేస్తారని అనుకోవటం అవివేకమని అన్నారు. తెలంగాణకు ఐదేళ్లు రేవంత్‌రెడ్డే సీఎంగా ఉంటారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.