ఆంధ్ర ప్రదేశ్
Srikakulam: విషాదం.. గొంతులో చెకోడి ఇరుక్కొని రెండేళ్ల చిన్నారి మృతి

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గొంతులో చెకోడి ఇరుక్కొని చిన్నారి మృతి చెందిన ఘటన.. రణస్థలం మండలం లంకపేటలో చోటు చేసుకుంది. చిన్నారి సోనాక్షిత ఏడుస్తుందని తల్లి చెకోడి ఇచ్చి పని చేసుకుంటుంది.
గొంతులో చెగోడి అడ్డంపడటంతో చిన్నారి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయింది. గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే చిన్నారి సోనాక్షిత చనిపోయింది. పాప మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.