తెలంగాణ
అమెరికాలో మహబూబాబాద్ యువతులు మృతి

అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన ఇద్దరు యువతులు మృతి చెందారు. గార్ల మీసేవ కేంద్ర నిర్వాహకుడు నాగేశ్వరరావు కుమార్తె మేఘన, ముల్కనూర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కుమార్తె భావన కారులో యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉన్నత చదువుల కోసం వెళ్లి విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ యువతుల మృతితో మండలంలో విషాద ఛాయలు అలముకున్నాయి.



