తెలంగాణ

ఒకే ఇంటి పై రెండు పిడుగులు

ఒకే ఇంటిపై రెండు పిడుగులు పడి ఇల్లు ధ్వంసమైన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ క్రమంలో వెంకన్న ఇంటి మెట్ల పై పిడుగు పడింది. దీంతో ఒక్కసారిగా ఇంట్లో ఉన్న దంపతులు ఉలిక్కి పడ్డారు. ఏం జరుగుతుందో చూసే లోపే ఐదు నిమిషాల వ్యవధిలో ఇంటి స్లాబ్ పై మరో పిడుగు పడింది.

దీంతో గృహోపకరణాలు కాలిపోగా స్లాబ్ పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనతో యజమానురాలు వెంకటమ్మ సొమ్మసిల్లి పడిపోగా ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పిడుగుపాటుకు వెంకన్నకు ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం చొరవ తీసుకొని నష్టపరిహారం ఇప్పించాలని వెంకన్న కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button