తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి

Road accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామంలో చోటుచేసుకుంది. మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన అజయ్, సాయి అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు పని నిమిత్తం మాచారెడ్డికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
అదుపు తప్పి ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



