తెలంగాణ
Chevella: కారులో ఆడుకుంటూ ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

Chevella: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారులో ఎక్కి ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరి ఆడక మృతి చెందారు. ఈ సంఘటన చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలో చోటు చేసుకుంది. ఇంటిముందు పార్కు చేసి ఉన్న కారులో ఆడుకోవడానికి చిన్నారులు ఇద్దరు అందులోకి ఎక్కారు.
ఈ సమయంలో ఒక్కసారిగా డోర్లు లాక్ అయ్యాయి. దీంతో కాసేపటికి ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మరణించారు. మరణించిన చిన్నారులు తన్మయశ్రీ, అభినయ శ్రీగా గుర్తించారు.