ఆంధ్ర ప్రదేశ్
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండు బిల్లులకు ఆమోదం

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండు బిల్లులకు ఆమోద ముద్ర పడింది. అక్వా డెవలప్మెంట్ అథారటీ సవరణ బిల్లుతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల సవరణ బిల్లుకు ఆమోదం తెలిపాయి. అక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారటీ సవరణ బిల్లుతోపాటు గ్రామ, వార్డు సచివాలయం చట్ట సవరణ బిల్లులను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలాగే ఆక్వా, సహకార శాఖలకు సంబంధించి చట్ట సవరణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. కూటమి ఎమ్మెల్యేల మద్దతుతో సదరు బిల్లులకు ఆమోద ముద్ర వేశారు



