Hari Hara Veera Mallu: పవర్ స్టార్ ‘హరి హర వీరమల్లు’ రిలీజ్లో ట్విస్ట్?

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం గురించి హాట్ టాక్ నడుస్తోంది. మే 9, 2025న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా విడుదల తేదీ మారే అవకాశం ఉందట! ఇంతకీ ఏం జరుగుతోంది?
పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ముంబైలో శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం పార్ట్-2 సన్నివేశాలను చిత్రీకరిస్తున్న యూనిట్, పవన్ కీలక సీన్స్‌ను ఏప్రిల్ చివరిలోపు పూర్తి చేయనుంది. డబ్బింగ్‌తో పాటు పవన్ సన్నివేశాలు కూడా ఫినిష్ కానున్నాయి. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, సునీల్, నోరా ఫతేహి లాంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి కొన్ని సన్నివేశాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే, రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. మరి, ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా? లేదా? అన్నది చూడాలి.