‘థగ్ లైఫ్’ ఓటీటీ రిలీజ్లో ట్విస్ట్?

Thug Life: యూనివర్సల్ హీరో కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో రూపొందిన ‘థగ్ లైఫ్’ సినిమా ఓటీటీ రిలీజ్‌పై సంచలన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కమల్ హాసన్, మణిరత్నం లాంటి దిగ్గజాల కలయికలో తెరకెక్కిన ‘థగ్ లైఫ్’ సినిమా థియేటర్లలో విడుదలైనప్పటికీ, తమిళం, తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించలేకపోయింది. త్రిష, అభిరామి, సింబు వంటి స్టార్ కాస్ట్‌తో, ఏఆర్ రెహమాన్ సంగీతంతో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు ముందుగా ఎనిమిది వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.
అయితే, బాక్సాఫీస్ వద్ద సినిమా ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో, ఓటీటీ ఒప్పందంలో మార్పుల కోసం నెట్‌ఫ్లిక్స్‌తో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఈ చర్చలు రిలీజ్ తేదీని ప్రభావితం చేస్తాయా? లేక కొత్త ఒప్పందాలు ఖరారవుతాయా? అన్నది సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.