తెలంగాణ
కోరుట్ల చిన్నారి కేసులో బిగ్ ట్విస్ట్… చంపింది స్వయానా పిన్ని..!

కోరుట్ల చిన్నారి హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బిట్ కాయిన్‌లో పెట్టుబడి పెట్టి.. 30లక్షల రూపాయలు పోగొట్టుకుంది మమత. పెద్ద మొత్తంలో నగదు పోగొట్టుకోవడం తో మమతను ఆమె తోడికోడలు నవీన, కుటుంబసభ్యులు చులకనగా చూశారు. దీంతో తోడికోడలు నవీన మీద కోపంతో చిన్నారి హితిక్షను చంపేసిందంటున్నారు పోలీసులు. ఇక చి న్నారిని చంపింది వాళ్ల చిన్నమ్మ మమతనేనని పోలీసులు స్పష్టం చేశారు.
ఇక హత్యలు ఎలా చేయాలని నిందితురాలు మమత యూట్యూబ్‌లో వీడియోలు చూసినట్టుగా విచారణలో గుర్తించారు పోలీసులు. హత్యకు ఒక కత్తి, కట్టర్ ఉపయోగించి హితిక్ష గొం తుపై విచక్షణారహితంగా పొడిచి చంపినట్టు తేల్చారు. సీసీ ఫుటేజ్ పరిశీలనలో ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం హితిక్ష పిన్ని మమతను విచారిస్తున్నారు పోలీసులు.