ఆంధ్ర ప్రదేశ్
టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ మృతి కేసులో ట్విస్ట్

టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ మృతి కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సతీష్‌కుమార్ హత్యకు గురైనట్టు పోలీసులు నిర్దారించారు. పరకామణి కేసులోని ప్రత్యర్థులే హత్య చేశారని సతీష్ కుమార్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుత్తి రైల్వే పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ ప్రయాణించిన రైలులో ప్రయాణికుల లిస్ట్‌ను పరిశీలిస్తున్నారు.



