Trump-Putin: ఢీ అంటే ఢీ అంటున్న ట్రంప్, పుతిన్

Trump-Putin: ట్రంప్, పుతిన్ లు ఢీ అంటే ఢీ అనుకుంటున్నారు. ఉక్రెయిన్ తో యుద్ధం ఆపడం లేదని ట్రంప్ రష్యా అధ్యక్షుడిపై కోపంగా ఉన్నారు. దీనిని మరింత ఎక్కువ చేస్తూ పుతిన్ ఆయనకు షాకిచ్చారు. అమెరికాతో ఓ ఉన్న ఓ కీలక ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. దీనిపై తాజాగా పుతిన్ సంతకం చేశారు.పుతిన్ వ్యవహరిస్తోన్న తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా మండిపోతున్నారు. దీంతో ఇప్పటి వరకు ఆగి ఉన్న అణు అగ్గి రాజుకున్నట్టయింది. ఇంతకీ ట్రంప్ ఎందుకు అంతలా మండిపోతున్నాడు.. పుతిన్ రద్దు చేసిన ఆ ఒప్పందం ఏమిటి..?
ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యవహరిస్తోన్న తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరిణామాల వేళ అమెరికాకు పుతిన్ గట్టి షాకిచ్చారు. అగ్రరాజ్యంతో ఉన్న ప్లుటోనియం ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన చట్టంపై పుతిన్ తాజాగా సంతకం చేశారు. దీంతో మళ్లీ అణు టెన్షన్ మొదలైనట్లయ్యింది. రష్యా దగ్గర అణు సామర్థ్యానికి, అణ్వాయుధాల తయారీకి సంబంధించిన మూల పదార్ధం చాలానే ఉంది.
దానిని అడ్డం పెట్టుకునే ఇన్నాళ్ళుగా మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది. రష్యా కనుక అణు శక్తిని వాడడం మొదలుపెడితే ఆపడం ఎవ్వరి తరమూ కాదు. అందుకే అగ్రరాజ్యం అమెరికా ముందు జాగ్రత్తగా 2000 సంవత్సరంలో రష్యాతో ది ప్లుటోనియం మేనేజ్‌మెంట్ అండ్ డిస్‌పొజిషన్ అగ్రిమెంట్ ను కుదుర్చుకుంది. దీని ప్రకారం యుద్ధాలు జరుగుతున్నప్పుడు త దగ్గర నిల్వ ఉన్న 34 మెట్రిక్ టన్నుల ప్లుటోనియాన్ని అణ్వాయుధాల తయారీకి కాకుండా.. కేవలం పౌర అణు విద్యుత్ కోసం మాత్రమే వాడాలి.
ఈ ఒప్పందాన్ని 2010లో మళ్ళీ సవరించారు కూడా. దీని ద్వారా దాదాపు 17 వేల అణ్వాయుధాల తయారుకాకుండా అడ్డుకున్నట్లు అవుతుందని అమెరికా లెక్కలు వేసింది. ఈ ఒప్పందం ప్రకారం.. ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత తమ వద్ద నిల్వ ఉన్న 34 మెట్రిక్ టన్నుల ప్లుటోనియంను అణ్వాయుధాల తయారీకి కాకుండా.. పౌర అణు విద్యుత్ కోసం వినియోగించేలా నిర్ణయించారు. ఈ ఒప్పందంతో దాదాపు 17 వేల అణ్వాయుధాల తయారుకాకుండా అడ్డుకున్నట్లు అవుతుందని అప్పట్లో అమెరికా అధికారులు అంచనా వేశారు.
అయితే ఈ ఒప్పందానికి 2016లోనే గండి పడింది. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రష్యాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ వెంటనే పుతిన్ కూడా ప్లుటోనియం ఒప్పందాన్ని నిలిపివేశారు. తాజాగా దాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ అగ్రిమెంట్‌ను పూర్తిగా రద్దు చేసుకుంటూ చట్టంపై సంతకం చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ.. ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. దీంతో రష్యా మళ్లీ అణ్వాయుధ తయారీని వేగవంతం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల రష్యా అణుశక్తితో నడిచే బురెవెస్ట్‌నిక్ క్రూజ్ క్షిపణిని పరీక్షించింది.
ఈ బురెవెస్ట్‌నిక్ క్రూజ్ క్షిపణి.. పరీక్షల సమయంలో 15 గంటల పాటు గాల్లోనే ఉందని, 14వేల కిలోమీటర్లు ప్రయాణించింది. అత్యంత కచ్చితత్వంతో ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్నైనా ఛేదించగల సామర్థ్యం దీని సొంతమని రష్యా సైన్యంలోని చీఫ్ ఆఫ్ స్టాఫ్ వారెలీ గెరాసిమోవ్ తెలిపారు. దీని మోహరింపునకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సైనికాధికారులను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు.
దీనిపై ట్రంప్ తాజాగా స్పందిస్తూ పుతిన్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్షిపణి ప్రయోగం తగదని, యుద్ధాన్ని ముగించడంపై రష్యా దృష్టిపెట్టాలన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన తమ అణు జలాంతర్గాములు రష్యా తీరానికి దగ్గర్లోనే ఉన్నాయని వాళ్లకు తెలుసు. మా ఆటలాడొద్దు. మేం కూడా ఎవరితోనూ గొడవలు పెట్టుకోవాలనుకోవట్లేదు. ఒక్క వారంలో ముగించాల్సిన యుద్ధాన్ని పుతిన్ తన చర్యలతో నాలుగో సంవత్సరానికి తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా క్షిపణి పరీక్షలు ఆపి యుద్ధం ముగించడంపై దృష్టిపెట్టాలని ట్రంప్ సూచించారు.
కాగా.. రష్యాలోని రెండు అతిపెద్ద చమురు కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షలపై మాస్కో తీవ్రంగా స్పందించింది. కొత్తగా విధించిన ఆంక్షలు మాస్కోపై తీవ్ర ప్రభావం చూపుతాయన్న అమెరికా వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తోసిపుచ్చారు. అగ్రరాజ్యం విధించిన ఆంక్షలు ఒత్తిడి పెంచే ప్రయత్నమే తప్ప మరొకటి కాదన్నారు.
అలాంటి ఒత్తిడులకు రష్యా ఎప్పుడూ తలవంచదని పుతిన్ స్పష్టం చేశారు. ఆత్మగౌరవం కలిగిన ఏ దేశము కూడా ఒత్తిడులకు తలవంచి ఏ పనిచేయదని తేల్చిచెప్పారు. ఆంక్షల వల్ల ప్రపంచ చమురు మార్కెట్ అస్థిరంగా మారటమే కాకుండా వాషింగ్టన్‌సహా అంతటా ఇంధన ధరలు పెరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌ను హెచ్చరించినట్లు పుతిన్ తెలిపారు.
రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా, ఐరోపా కూటమి ఆంక్షలు విధించాయి. రెండు అతి పెద్ద చమురు సంస్థలపై అగ్ర రాజ్యం ఆంక్షలు విధించగా, ఆర్థిక ఆంక్షలను ఈయూ ప్రకటించింది. ఇవి నవంబరు 21వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది. పుతిన్ చేస్తున్న యుద్ధానికి ప్రతిగా రష్యాలోని అతి పెద్ద చమురు కంపెనీలు రాస్‌నెఫ్ట్, లుకాయిల్‌లపై ఆంక్షలను విధిస్తున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ బుధవారం ప్రకటించారు. వాటికి అనుబంధంగా పని చేసే డజన్ల కొద్దీ కంపెనీలపైనా ఈ ఆంక్షలు అమలవుతాయని తెలిపారు. ఈ రెండు కంపెనీలు యుద్ధానికి నిధులను అందిస్తున్నాయని ఆరోపించారు. యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు అండగా మరిన్ని చర్యలకు సిద్ధమని ఆయన ప్రకటించారు.



